రామవరం, అక్టోబర్ 27 : ప్రజా పాలన దరఖాస్తు ఎంక్వయిరీలో ఇందిరమ్మ గృహ మంజూరులో స్థలం ఉండి కూడా స్థలం లేని (ఎల్ టు) జాబితాలో తమ పేర్లు నమోదయ్యాయని రామవరానికి చెందిన చల్ల రమ్య, బోదాసు జ్యోతి గ్రీవెన్స్ లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఉండి కూడా స్థలం లేని జాబితాలో (ఎల్ టు) ప్రచురించారన్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా సుమారు 30 పేర్లు ఎల్ వన్ లో నమోదు కావాల్సిన పేర్లను ఎల్ టు లో ప్రచురించడం జరిగిందననారు. ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించి వారి పేర్లను ఎల్ వన్ జాబితాలోకి తీసుకు రావాలని ఆర్డీఓను కోరారు. వినతి పత్రం అందించిన వారిలో ఉప్పతల శ్రీనివాస్, చల్ల రమ్య , బోదాసు జ్యోతి, బోదాసు సంపత్ ఉన్నారు.