రామవరం, ఆగస్టు 02 : తెలంగాణ సిద్ధాంతకర్త, దివంగత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి (ఆగస్టు 6) నిర్వహణకు ఏరియాకి ప్రత్యేక నిధులు కేటాయించాలని సింగరేణి బీసీ & ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు శనివారం అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా ఎస్ ఓ టు జిఎం జీ.వి కోటిరెడ్డిని ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆ మహనీయుని జయంతి వేడుకలను సింగరేణి యాజమాన్యం ఘనంగా నిర్వహించాలని, అందుకు అన్ని ఏరియాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.
బీసీ , ఓబీసీ అగ్ర నాయకత్వం ఆదేశాలు మేరకు నేడు ఎస్ ఓ టు జిఎం కోటిరెడ్డిని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు, రాజలపూడి సాంబమూర్తి, గోపు కుమార్, గట్టయ్య, మెంగెన్ రవి, కమల్, కుసానా నరేందర్, వేముల నరేశ్, నాగరాజు, రాజేశ్, ఓంకార్, భర్తచంద్ర, నరసింహ, కృష్ణ, జనార్ధన్, ఈ.శ్రీనివాస్ పాల్గొన్నారు.