రోడ్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కూనంనేనికి వినతి
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామవరం 15వ డివిజన్ కొత్తూరు రాజాం బస్తి పోచమ్మ గుడి ఏరియాలో నుండి విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారి వరకు నూతనంగా రోడ్డు ఏర్పాటు చేయాలని బస్తీ వాసులందరూ బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో...
కొత్తగూడెం సింగరేణి, జూన్ 10 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామవరం 15వ డివిజన్ కొత్తూరు రాజాం బస్తి పోచమ్మ గుడి ఏరియాలో నుండి విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారి వరకు నూతనంగా రోడ్డు ఏర్పాటు చేయాలని బస్తీ వాసులందరూ బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు ఈ ఏరియాలో అంబులెన్స్ వెళ్లి రావడానికి రహదారి సక్రమంగా లేదని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచమ్మ తల్లి దేవాలయం నుండి మెయిన్ రోడ్డు వరకు రహదారి నిర్మాణం చేపట్టి బస్తి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఎమ్మెల్యేను కోరారు.
రోడ్డుకు అనుకూలమైన స్థలం ఉండాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ముదిరాజ్ భవనం పక్కన కావాల్సినంత స్థలం ఉందని అందులో కొద్దిగా అంబులెన్స్ రాకపోకలకు అనుకూలమైన రోడ్డుకు అవసరమైన స్థలం కేటాయించాలని కోరారు. ప్రజల అవసరం నిమిత్తం రోడ్డు నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో కొత్తూరి మదనయ్య, రామవరం పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ముస్తఫా, కొత్తూరి రవికుమార్, సంపత్ కుమార్, చుక్కయ్య, పెరక కిరణ్, కొమ్ము శివ, దాసారపు రాజేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

