భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 15 : కార్మిక నేత రాసూరి శంకర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కార్మికులు, బంధువులు మార్చురీ రూమ్ ఎదుట ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే..నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంగం సెంట్రల్ కమిటీ మెంబర్ శంకర్ మృతి చెందాడు.
రాత్రి నుండి ఈ రోజు 12 గంటల వరకు పోస్టు మార్టం చెయ్యకపోవడంతో ఉద్యమ నాయకులు, బంధువులు, సింగరేణి కార్మికులు ఆందోళన చేపట్టారు. కాగా, ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక వైపు నుండి వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో కార్మిక హక్కుల నేత రాసూరి శంకర్ (58) దుర్మరణం చెందారు. ఈ ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ధన్బాద్ వద్ద సోమవారం జరిగింది.