రుద్రంపూర్, జూన్ 02 : పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రుద్రంపూర్‌కు చెందిన పార్టీ కార్యకర్త కంటాత్మకూరి ముఖేష్ తల్లి ఇటీవల మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం ముఖేష్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖేష్ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా తాము కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కంటాత్మకూరి ఆంజనేయులు, ముఖేష్లను పరామర్శించి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాననే భరోసా కల్పించారు. ఆయన వెంట కార్పొరేటర్లు ఇందు తపస్వీ, సంకు బాపన అనుదీప్, మాజీ ఎంపీపీ బాడావత్ శాంతి, చుంచుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు గూడెల్లి యాకయ్య, రామంజి శ్రీనివాస్, గుమ్మడి సాగర్‌బాబు, సతీష్ ఉన్నారు.