జూలూరుపాడు, మే 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. జూలూరుపాడు ప్రధాన సెంటర్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు లేళ్ల వెంకట్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ బడుగు, బలహీన వర్గాల కోసం సేవలందించిన మహానీయుడు అన్నారు. ఆయన ప్రజల గుండెల్లో నిత్య సజీవుడనని కొనియాడారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జూలూరుపాడు మండలాధ్యక్షుడు మంగీలాల్ నాయక్, వెంగన్నపాలెం మాజీ ఎంపీటీసీ దుద్దుకూరి మధు, సూదన్ రావు, కాకర్ల మాజీ ఎంపీటీసీ సతీశ్, కాంగ్రెస్ నాయకులు సుమంత్, రోకటి సురేశ్, రామిశెట్టి రాంబాబు, లచ్చు నాయక్, జూలూరుపాడు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోదుగు రామకృష్ణ, కొలిపాక వెంకటేశ్వర్లు, మెంతుల కృష్ణ, తోట శ్రీను, మహిళా మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.