ఇల్లెందు, ఏప్రిల్ 21 : విద్యుత్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని విద్యుత్ శాఖ వరంగల్ సిఎండి కె.వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇల్లెందు మండలం పరిధిలో చల్ల సముద్రం, ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న విద్యుత్ పనులను సిఎండి వరుణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో వ్యవసాయం కోసం నిర్వహిస్తున్న విద్యుత్ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, విద్యుత్ భద్రత సూత్రాలు పాటిస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే విద్యుత్ వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఎక్కడా వేసవి కాలంలో లో ఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈ వరంగల్ అనిల్ కుమార్, కొత్తగూడెం ఎస్సీ మహేందర్, రంగస్వామి, వెంకటేశ్వర్లు, ఏడీఈ రాంబాబు, రామారావు, ఏఈలు సతీష్, హనీషా పాల్గొన్నారు.