జూలూరుపాడు, మే 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి బేతాళపాడు గ్రామ పంచాయతీలోని రేగళ్లతండాకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని నిరసన తెలియజేస్తూ శనివారం వాటర్ ట్యాంక్ ఎక్కారు. వీరిలో వారిలో నలుగురు మహిళలతో పాటు ముగ్గురు పురుషులు ఉన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ఇల్లు కేటాయించే వరకు ట్యాంక్ దిగమని భీష్మించుకుని ట్యాంక్ పైనే నినాదాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పినప్పటికీ, తమకు న్యాయం జరిగే వరకు ట్యాంక్ దిగబోమని తేల్చి చెప్పారు.
Julurupadu : ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన