బూర్గంపహాడ్, జూన్ 05 : ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించి మొక్కలు నాటడంపై దృష్టి సారించాలని మణుగూరు, అశ్వాపురం రేంజ్ ఎస్ఆర్ఓ సత్తాజ్ అలీ, డీఆర్ఓలు కృష్ణ, ధనలక్ష్మి, వెంకట్రావు అన్నారు. శుక్రవారం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు, సర్పంచ్ కిశోర్నాయక్తో కలిసి సారపాక పుష్కరవనం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడంతో పాటు మంచి ఆక్సిజన్ మానవాళికి అందుతుందన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించడం అలవాటు చేసుకోవాలని అప్పుడే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలనే బాధ్యతను గుర్తు చేస్తుందంటూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం, మణుగూరు రేంజ్ బీట్ ఆఫీసర్లు బాబూరావు, ఎర్రయ్య, భీమ్‌చంద్, ఉపేందర్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.