– పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్
టేకులపల్లి, జనవరి 17 : కోతులు, కుక్కల వల్ల టేకులపల్లి మండలంలోని 36 గ్రామ పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కావునా వాటి బెడద నుండి ప్రజలను కాపాడాలని ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ అన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కోతులు, కుక్కల దాడిలో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు గాయాలపాలవుతున్నారన్నారు. గత రెండు సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీకి పాలక వర్గాలు లేక నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉండడం జరిగిందన్నారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గం, సర్పంచ్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. గ్రామ పంచాయతీలో వేదిస్తున్న కోతులు, కుక్కల బెడదను తప్పించాలని, అదేవిధంగా వీధి దీపాలు, బ్లీచింగ్, ఫాగింగ్ చేయాలని, గుంతలమయంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయలని పేర్కొన్నారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వెంటనే పనులను గుర్తించి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.