చుంచుపల్లి, జనవరి 20 : నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ పంచాయతీ రాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పులిగంటి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు మంగళవారం సంఘ సభ్యులతో కలిసి పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ విద్యాలతను జిల్లా పరిషత్ కార్యాలయం నందు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4వ తరగతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, అర్హత గల వారికి వెంటనే ప్రమోషన్స్ ఇప్పించాలని, యూనిఫామ్స్ ఇప్పించాలని, గతంలో ఇచ్చేటువంటి స్టిచ్చింగ్ చార్జెస్ ఇప్పుడు సరిపోనందున వాటిని పెంచాలని కోరారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.