ఇల్లెందు, జూలై 15 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీసీ నేతలు సిరివేరి సత్యనారాయణ, దిండిగాల రాజేందర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీసీ మహాధర్నా కార్యక్రమానికి ఇల్లెందు పట్టణం నుండి బీసీ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ బిల్లుకు వెంటనే చట్టబద్ధత కల్పిస్తూ పకడ్బందీగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఎస్.రంగనాథ్, రవితేజ, డేరంగుల పోశం, కాసాని హరిప్రసాద్, చాంద్‌పాషా, రవికాంత్, ఘాజి, జబ్బర్ పాల్గొన్నారు.