ఇల్లెందు, ఆగస్టు 30 : ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని ఇల్లెందు కోర్టు జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శనివారం ఇల్లెందు పట్టణ సబ్ జైల్ను ఆమె సందర్శించారు. సబ్ జైల్ పరిసరాలను, వంటశాలను పరిశీలించారు. వర్షాకాలం వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఖైదీలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. ఖైదీలకు మెనూ ప్రకారం సదుపాయాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. జైలు జీవితం ఒక పాఠంగా తీసుకుని సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.
జైలు నుండి విడుదలైన అనంతరం జైలు జీవితం మర్చిపోయి సంఘంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అనంతరం ఖైదీలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంపెల్లి ఉమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, సబ్ జైల్ సూపరింటెండ్ చంద్రశేఖర్, హెడ్ వార్డెన్ భుజరంగ రాజు, జైలు సిబ్బంది భాస్కర్, శ్రీనివాస్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.