పాల్వంచ, ఏప్రిల్ 20 : పాల్వంచ పట్టణంలోని టీచర్స్ కాలనీ, గట్టాయిగూడెం, ఒడ్డుగూడెం, సబ్స్టేషన్ ఏరియా, మార్కెట్ ఏరియా పరిసర ప్రాంతాల అంగన్వాడీ కేంద్రాలను సమన్వయం చేస్తూ 38వ డివిజన్లో పోషణ్ పక్వాడా కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్, 36వ డివిజన్ కార్పొరేటర్ పైడిపల్లి జయలక్ష్మి, 45వ డివిజన్ కార్పొరేటర్ దంతెభోయిన నరేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం చాలా ముఖ్యమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే పరిశుభ్రత, సమతుల్య ఆహారం, తల్లి–శిశు సంరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని అంగన్వాడీ సూపర్వైజర్ నండ్రు దీపా తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంగళరావు కాలనీ అంగన్వాడీ సూపర్వైజర్ నందృదీపా, అంగన్వాడీ టీచర్లు పెరుమాళ్లపల్లి సౌభాగ్యం, జిల్లేపల్లి సుగుణవాణి, ఎన్నబోయిన ప్రమీల, ఎస్కే.మౌలాలి, గడ్డం గీత, నందిగామ నాగులు, బండి కళావతి, ఎస్కే.నూరునిస్స పాల్గొన్నారు.

పాల్వంచలో ఘనంగా పోషణ్ పక్వాడ కార్యక్రమాలు