రామవరం, మే 13 : పాలీసెట్ – 2025 ప్రవేశ పరీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ప్రశాంతంగా నిర్వహించినట్లు పాలీసెట్ కో ఆర్డినేటర్, రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం-6 ,భద్రాచలం-2, మణుగూరు-3 సెంటర్లో పరీక్ష నిర్వహించినట్లు, అన్ని సెంటర్లో ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ జరిగిందని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
మణుగూరు (2) సెంటర్లలో 618 మంది హాజరవ్వగా 27 మంది గైరాజరయ్యారని, అలాగే భద్రాచలం రెండు సెంటర్లలో 659 హాజరు హాజరవ్వగా 60 మంది గైరాజరయ్యారని, అలాగే కొత్తగూడెం పరిధిలోని ఆరు సెంటర్లలో 1,840 మంది హాజరవ్వగా 148 మంది గైరాజరయ్యారని ఆయన తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 3,352 మందికి 3,117 మంది పరీక్షకు హాజరయ్యారని మొత్తం 93 శాతం హాజరయ్యారని తెలిపారు.