బూర్గంపహాడ్, జూలై 23 : విద్యార్థిని అపహరించిన ఘటనలో బూర్గంపహాడ్ పోలీసులు ఓ యువకుడిపై గురువారం పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ ను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అశ్వాపురం మండలం కల్యాణపురం గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి అపహరించాడు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. దుమ్ముగూడెం మండలానికి చెందిన బాలిక కేజీబీవీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆ యువకుడు బాలికను వివాహం సైతం చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.