ఇల్లెందు, ఆగస్టు 19 : వినాయక చవితి సందర్భంగా ఇల్లెందు పట్టణంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను అన్నారు. మంగళవారం ఇల్లెందు పట్టణంలో గణేష్ ఉత్సవ కమిటీ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టేవారు పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలన్నారు. మండపాల వద్ద డీజేలు పెట్టకూడదని సూచించారు. రాత్రి వేళల్లో గుంపులుగా ఉండి ప్రజలను ఇబ్బందులకు గురిచేయొదన్నారు. విద్యుత్ వైర్ల కింద మండపాలు, విగ్రహాలు పెట్టకూడదన్నారు. విద్యుత్, అగ్నిమాపక శాఖల అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ హసీనా, సూర్య, సిబ్బంది పాల్గొన్నారు.