టేకులపల్లి, సెప్టెంబర్ 24 : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోడు ఎస్ఐ పి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలోని బోడు గ్రామంలో సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నట్లు తెలిపారు. తెలియని వ్యక్తులు కాల్ చేస్తే బ్యాంక్ వివరాలు, ఓటీపీలు పంచుకోవద్దన్నారు. ఫోన్ లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, ఈ కేవైసీ అప్డేట్ వివరాలు అడిగితే చెప్పకూడదన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930 టోల్ ఫ్రీ నంబరుకు వెంటనే డయల్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.