రామవరం, అక్టోబర్ 22 : డ్రగ్స్‌పై యుద్ధంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపు మేరకు చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా బుధవారం చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్ పంచాయతీలో డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ స్కానర్ ద్వారా తనిఖీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలన్నారు. గంజాయి అక్రమ రవాణా చేసే వారి సమాచారం అందించి బాధ్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు.
ఈ తనిఖీల్లో మొత్తం 37 బైకులు, 2 ఆటోలు, 1 కారు, 20 బీర్ బాటిళ్లు, 223 క్వార్టర్ మద్యం బాటిళ్లు (మొత్తం విలువ రూ.46,190/-) స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అదనంగా 30 ఈ-చలాన్లు బుక్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ తనిఖీల్లో టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్, కరుణాకర్, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు మనీషా, రమాదేవి, రాకేశ్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Ramavaram : డ్రగ్స్‌పై యుద్ధంలో ప్రజలు భాగస్వాములు కావాలి : డీఎస్పీ అబ్దుల్ రెహమాన్