భద్రాచలం, ఏప్రిల్ 17 : ప్రజలంతా ట్రాఫిక్ నిబందనలు పాటిస్తూ వాహనాలను నడపాలని, అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం భద్రాచలంలో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్- అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాద్యత అన్నారు. అలాగే ప్రతి వాహనదారుడు హెల్మెట్ ను ధరించాలని సూచించారు, ప్రతి వాహనదారుడు తగిన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ముదిగొండ రామకృష్ణ మాట్లాడుతూ.. హెల్మెంట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి, టౌన్ ఎస్ఐ శ్యాం కుమార్, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.