చుంచుపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండాలో శనివారం పెద్దమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర సందర్భంగా పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దగుట్ట నుండి సర్వల్ కర్రలను తీసు కొచ్చారు. సరుగులు (కర్రలు) తేవడానికి రెండు రోజులుగా కమిటీ సభ్యులు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తారు.
శనివారం సాయంత్రం ఈ సర్వలను తీసుకువచ్చి గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో యువకులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం ఆ కర్రలను కనులగా నరికి ముక్కలు చేసి ఆదివారం తెల్లావారుజామున హోమ గుండం నిర్మిస్తారు. అమ్మవారికి మేకపోతులు, కోళ్లను బలిస్తారు.
Chunchupalle : ఘనంగా పెద్దమ్మ తల్లి జాతర