రామవరం, నవంబర్ 05 : రాజీయే రాజమార్గం. చిన్న చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, న్యాయశాఖ కల్పించిన ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. ఈ నెల 15న జరిగే మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రాజీకి అనుకూలమైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ పరమైన సమస్యలు, వైవాహిక వివాదాలు, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమవుతాయి” అని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు.