రామవరం, సెప్టెంబర్ 10 : సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి రవాణాలో కొత్తగూడెం ఏరియా ముందు వరుసలో ఉందని, క్రీడల్లోనూ ముందు వరుసలో ఉండాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో 2025-26 వార్షిక సంవత్సరానికి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (WPS & GA) లో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్, రుద్రంపూర్ నందు నిర్వహించే కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, ఇతర క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ప్రతి విషయంలోనూ పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందన్నారు. వ్యక్తిగత జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండడానికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలన్నారు. రీజినల్, కంపెనీ లెవెల్, కోల్ ఇండియా లెవెల్లో జరుగు క్రీడల్లో పాల్గొని కొత్తగూడెం ఏరియాకు కీర్తి ప్రతిష్టలు తీసుకు రావాలని ఆయన ఆకాక్షించారు.
పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వట్టికొండ మల్లికార్జున్ మాట్లాడుతూ.. కార్మికుల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అలాగే ఓపెన్ ఓపెన్ జిమ్‌ను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని జీఎం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుని ఈ సంవత్సరం జరిగే పోటీల్లో అవి పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.
Ramavaram : ఆటల పోటీల్లో గెలవడం కన్నా పాల్గొనడం ముఖ్యం : జీఎం శాలెం రాజు
ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ మాట్లాడుతూ.. కంపెనీ లెవెల్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించుకునేందుకు గ్రౌండ్లో ఇప్పటికే గ్రీన్ గ్రాస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంచి లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తే డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు అణువుగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వి.మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్, ఎస్ఓటు జీఎం జీవి.కోటిరెడ్డి, ఏజీఎం (సివిల్) సీహెచ్.రామకృష్ణ, డీజీఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, డీవైపీఎం, అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్ ఎం.సి పోస్నేట్, యూనియన్ ప్రతినిధులు, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ భూక్యా భీముడు, జనరల్ కెప్టెన్ బి.వెంకటేశ్వర్లు, వివిధ క్రీడల కెప్టెన్స్, క్రీడాకారులు పాల్గొన్నారు.
Ramavaram : ఆటల పోటీల్లో గెలవడం కన్నా పాల్గొనడం ముఖ్యం : జీఎం శాలెం రాజు