జూలూరుపాడు, మే 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా కొమ్మినేని పాండురంగారావు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు ఇప్పటి వరకు పర్సనల్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన శ్రీనివాసరావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరెక్టర్లు చైర్మన్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం చైర్మన్ పాండురంగారావు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఆకాంక్షించారు.
సహకార సంఘం ద్వారా రైతులకు అందించే సేవలను మరింత చేరువ చేస్తామని, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ వారికి సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా ముందస్తు ప్రణాళికలతో పని చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ నరసింహారావుతో పాటు డైరెక్టర్లు యల్లంకి సత్యనారాయణ, చాపలమడుగు రామ్మూర్తి, హేమ్లా, రెడ్డిబోయిన రాము, పాపిన్ని వెంకయ్య, తిరువెంగళరావు, శిరంశెట్టి రామారావు, జవహర్లాల్ పాల్గొన్నారు.