జూలూరుపాడు, ఆగస్టు 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో గురువారం పద్మశాలి సంఘం వన సమారాధన నిర్వహించింది. భారీ ర్యాలీగా పటాకులు కాల్చుతూ డీజే సౌండ్ సిస్టమ్ తో ఇంటిల్లిపాది గ్రామంలోని శ్రీసంతాన వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలోని పాలగుట్ట వద్దకు బయల్దేరి వెళ్లారు. పరిచయాలు.. పలకరింపులు.. ఆత్మీయ ఆలింగనాలు..యోగక్షేమాలు.. కబుర్లు.. ఆట పాటలు.. డాన్సులు.. సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకుల ఉపన్యాసాలు.. సహపంక్తి భోజనాలతో సందడిగా గడిపారు.
పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు తుమ్మ నరసింహారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పద్మశాలి కుల బంధువులంతా ఐకమత్యంతో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కులస్తులంతా ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేందుకు కుల బాంధవులు ఐక్యంగా ఉండి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు సోబ్బని సూర్యం, గ్రామ అధ్యక్షుడు సోబ్బని శ్రీను, పడమటి నర్సాపురం గ్రామ అధ్యక్షుడు పెంటి శ్రీను, సీనియర్ జర్నలిస్ట్ గుండా సత్యనారాయణ, మహిళా సంఘం నాయకురాలు తుమ్మ విజయలక్ష్మి, పద్మశాలి సంఘం నాయకులు కొండె వెంకటేశ్వర్లు, కొక్కుల సూరయ్య, కొక్కుల సంతోశ్, కొండె రమేశ్, సోబ్బని లాలయ్య, పోలూరి అప్పయ్య, పోలూరి మురళి, కొండె శ్రీనివాస్, దాసరి నాగయ్య, పోలూరి వెంకటప్పయ్య పాల్గొన్నారు.
Julurupadu : కాకర్లలో పద్మశాలి సంఘం వన సమారాధన
Julurupadu : కాకర్లలో పద్మశాలి సంఘం వన సమారాధన