కొత్తగూడెం : సింగరేణి రైటర్బస్తీ కాలనీలో పుట్టి పెరిగి , చదివిన విద్యార్థులు 50ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. పలు సంస్థల్లో పనిచేస్తున్నవారు, పనిచేసి పదవీ విరమణ పొందిన వారంతా 50 ఏండ్ల తరువాత మళ్లీ కలుసుకున్నారు. కొత్తగూడెం కేసీవోఏ క్లబ్లో గురువారం పూర్వ విద్యార్థులు 54 మంది కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చదువుకున్న పాఠశాలను, గుర్తు చేసుకొని టీచర్లను స్మరించుకున్నారు.
ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని, సరదాగా గడిపారు. సింగరేణికి తామంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జీఎం ఎం.శ్రీనివాస్, పి.రామకృష్ణ, అక్బర్లు పాల్గొన్నారు.