లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 29 : లక్ష్మీదేవిపల్లి మండలంలోని వేపలగడ్డను అధికారులు పట్టించుకోకపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలు ఎక్కడికక్కడే పడకేశాయి. పంచాయతీలో వివిధ పనులకు, చెత్తాచెదారం తీసేందుకు ఓ ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ సైతం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ఎక్కడి పారిశుధ్య పనులు అక్కడే పేరుకుపోయాయి. తాగు నీటి కోసం, మొక్కలకు నీళ్లు పోసేందుకు ఉన్న ట్యాంకర్ కూడా నిరుపయోగంగా ఉంది. గ్రామంలో సైడ్ డ్రైన్ సమస్య తీవ్రంగా ఉంది. వీధి దీపాలు వెలగడం లేదని, అధికారులు, పంచాయతీ సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Laxmidevipally : వేపలగడ్డను పట్టించుకోని అధికారులు.. గిరిజనుల ఇబ్బందులు