– రిలే నిరాహార దీక్షలకు బీసీ, ఓబీసీ అసోసియేషన్ సంఘీభావం
రుద్రంపూర్, జూలై 06 : సింగరేణి అధికారుల శ్రమకు తగిన వేతనాలు చెల్లించి, వారి గౌరవాన్ని కాపాడడంతో పాటు సంస్థ భవిష్యత్‌ను మరింత బలోపేతం చేయాలని బీసీ, ఓబీసీ కొత్తగూడెం ఏరియా అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య అన్నారు. సోమవారం
సీఎంఓఏఐ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయం ముందు కొనసాగుతున్న అధికారుల రిలే నిరాహార దీక్షల ఎనిమిదో రోజు కార్యక్రమానికి హాజరైన ఆయన అధికారులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణిలో కూడా కోల్ ఇండియా తరహాలో పే అప్గ్రేడేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
2017 వేతన సవరణ వల్ల అధికారులకు జరిగిన నష్టాన్ని సరిదిద్దుతూ పే అప్గ్రేడేషన్ను వెంటనే అమలు చేయాలని, అలాగే అధికారుల వేతనాల్లో భాగమైన 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) బకాయిలను ఆలస్యం చేయకుండా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కాసర్ల మోహన్, మెంగని అశోక్, బింగి గోపాల్, గోపు కుమార్, మల్లికార్జున రావు, వల్లాల సాంబమూర్తి, నల్ల ప్రభాకర్, పిల్లి భరత్, వేల్పుల శ్రీనివాస్, లగ్గాల అజయ్, శ్రీకాంత్ శర్మ, సముద్రాల శ్రీనివాస్, యాకుబుద్దీన్, బాబుద్దీన్, ఇంజపురి సారా సమ్మయ్య, కట్ట నరసింహారావు, రమేష్, నరేష్, పెంచికల నరేందర్, రాజకుమార స్వామి, ఈ.రాజయ్య, టి.రమేశ్, తుమ్మ శ్రీనివాసరావు పాల్గొన్నారు.