– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 155 గ్రామ పంచాయతీల్లో స్వీకరణ
– మొదటి విడత ఉప సంహరణ నేడే
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 03 : గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 155 పంచాయతీల పరిధిలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి, రెండవ దశల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ అభ్యర్థుల ఉపసంహరణ నేడు జరుగుతున్న నేపథ్యంలో ఆయా నామినేషన్ కేంద్రాల వద్ద ఉప సంహరించుకునేవారు రిటర్నింగ్ అధికారికి అఖిత పూర్వకంగా లెటర్లు ఇస్తున్నారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు దశల పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.