– చుంచుపల్లి తాసీల్దార్ నాగరాజు
చుంచుపల్లి, సెప్టెంబర్ 05 : ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల్లో ఇంటి పేరు ముందు, వెనుక ఉండడం, పేర్లలో స్పెల్లింగ్ తప్పులు, వయస్సులో తేడాలు వంటి చిన్నపాటి లోపాలపై ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చుంచుపల్లి తాసీల్దార్ నాగరాజు అన్నారు. శనివారం బాబు క్యాంప్ పంచాయితీలో నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2002 ఓటరు జాబితాలోని వివరాలను ప్రస్తుత వివరాలతో పోల్చి, ఓటర్ల వద్ద ఉన్న సంబంధిత ధ్రువపత్రాలను బీఎల్ఓ స్థాయిలోనే పరిశీలించి అవసరమైన సవరణలు చేస్తామని తెలిపారు. ఇలాంటి తేడాల వల్ల ఓటు హక్కుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. నో మ్యాపింగ్ ఓటర్లు 2002లో ఓటు ఉండి ప్రస్తుతం మ్యాపింగ్ కానివారు, సంబంధిత వివరాలు సమర్పించని వారికి హియరింగ్‌లో అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
1987 జూలై 1 కంటే ముందు జన్మించిన వారు గతంలో సూచించిన 13 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకదాన్ని సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. 1987 జూలై 1 నుంచి 2004 మధ్య జన్మించిన వారు తమ ధ్రువపత్రాలతో పాటు తల్లి లేదా తండ్రికి సంబంధించిన ధ్రువపత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. ఓటర్లు తమకు అందిన నోటీసుకు అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి, కేటాయించిన హియరింగ్ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరై సమర్పించవచ్చన్నారు. ఓటరు స్వయంగా రాలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు లేదా వారసులు ధ్రువపత్రాలను తీసుకొచ్చి సమర్పించినా పరిశీలిస్తామని తెలిపారు.
సెప్టెంబర్ 8, 9 : చుంచుపల్లి తండా
సెప్టెంబర్ 10, 11, 15 : విద్యానగర్ కాలనీ
సెప్టెంబర్ 16 : గరిమెళ్లపాడు
సెప్టెంబర్ 17 : 3-ఇంక్లైన్
సెప్టెంబర్ 18 : 4-ఇంక్లైన్
సెప్టెంబర్ 19 : గౌతంపూర్
సెప్టెంబర్ 22, 23, 24, 25 : రుద్రంపూర్
సెప్టెంబర్ 26, 29 : పెనగడప
ఆయా తేదీల్లో సంబంధిత పంచాయతీ కార్యాలయాల్లో హియరింగ్ నిర్వహించనున్నట్లు తాసీల్దార్ తెలిపారు. నోటీసులు అందని ఓటర్లకు కూడా హియరింగ్ తేదీన ఫోన్ ద్వారా సమాచారం అందించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంబంధిత ఓటర్లు తమకు కేటాయించిన తేదీన అవసరమైన ధ్రువపత్రాలతో ఆయా పంచాయతీ కార్యాలయాలకు హాజరై ప్రక్రియను పూర్తి చేసుకోవాలని నాగరాజు కోరారు.

‘నో మ్యాపింగ్ ఓటర్లు ధ్రువపత్రాలతో హియరింగ్‌కు హాజరుకావాలి’