చుంచుపల్లి, ఆగస్టు 07 : జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని చుంచుపల్లి మండలంలో విజయవంతం చేయాలని ఎంపీడీఓ సీహెచ్ సుభాషిని సిబ్బందికి సూచించారు. గురువారం చుంచుపల్లి మండల టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమం విజయవంతంపై విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ, ఇతర లైన్ డిపార్ట్మెంట్లకు ఆమె సూచనలు చేశారు. అన్ని శాఖల వారు పరస్పర సమన్వయం, సహకారంతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెనగడప వైద్యాధికారిణి డాక్టర్ నేహా అంబ్రీన్, హెచ్ఈఓ కె.వెంకటేశ్వర్లు, చుంచుపల్లి హైస్కూల్ హెచ్ఎం జి.తబిత సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి కె.చంద్రకళ, అంగన్వాడీ సూపర్వైజర్, సుజాతనగర్ పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ బి.జానకి రామ్ పాల్గొన్నారు.