దమ్మపేట రూరల్, జూలై 09 : మాతృ వియోగంతో బాధపడుతున్న బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వర్రావు బుధవారం పరామర్శించారు. రేగా స్వగ్రామమైన సమత్ బట్టుపల్లిలో ఆయన తల్లి నర్సమ్మకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు దొడ్డా రమేశ్, దారా యుగంధర్, సోయం వీరభద్రం ఉన్నారు.