రామవరం, ఆగస్టు 14 : ఈ ఏడాది జరిగిన బీ.ఈడి 2025 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన ముస్లిం మైనార్టీ విద్యార్థులు ముస్లిం మైనారిటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రత్యేక కౌన్సిలింగ్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎండి. యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన ముస్లిం విద్యార్థులు ఈ ఏడాది జరిగిన ఎడ్ సెట్ ర్యాంక్ కార్డు, ఇంటర్, డిగ్రీ, 10వ తరగతి మెమో, 9 నుండి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్ తో పాటు తొమ్మిది సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకుని బషీర్బాగ్ నందు గల ముస్లిం యూనివర్సిటీ, ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ నందు జరిగే కౌన్సిలింగ్ కు హాజరు కావాలన్నారు. ఈ నెల 19న ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఓరియంటల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, 20న సోషల్ స్టడీస్, 21వ తేదీన బయోలాజికల్ సైన్స్ విద్యార్థులకు కౌన్సిలింగ్ జరుగనున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాల కొరకు TGEd cet 2025 AC- SW-ll కన్వీనర్ జుబేర్ నంబర్ 9700375315, 8520860785 లలో సంప్రదించాలని పేర్కొన్నారు.