రుద్రంపూర్, ఏప్రిల్ 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రూ.20 లక్షలు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుడు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నవతన్ విజ్ఞప్తి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రాఘవ సిఫార్సు మేరకు రవిచంద్ర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన ఎంపీ నిధుల నుండి రూ.20 లక్షలు ఇస్తానని ప్రకటించారు. కొత్తగూడెంలో పర్యటిస్తున్న ఎంపీ రవిచంద్రను నవతన్ కలిసి హాల్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదన వివరాలను అందజేశారు. తన విజ్ఞప్తి పట్ల వెంటనే సానుకూలంగా స్పందించడంతో నవతన్ సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వెంకటేశ్వరరావు,ఆ యన కుమారుడు రాఘవకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.