Badradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 11 : బిడ్డపై తల్లి ప్రేమ.. కన్న పేగు బంధం ఎంత ఉంటుందో ఇది చూస్తే తెలుస్తుంది.. బిడ్డను లాలించడానికి తల్లి ఏకంగా కలెక్టరేట్లో ఉయ్యాల కట్టి ట్రైనింగ్‌కు వెళ్లింది. కొత్తగూడెం కలెక్టరేట్లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ఈ ఫొటో అందరినీ ఆలోచింప చేసింది.
కొత్తగూడెం కలెక్టరేట్లో మంగళవారం ఏఎన్ఎంలకు శిక్షణ ఏర్పాటు చేశారు. కరకగూడెం ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న రేఖ .. ఐదు నెలల బిడ్డను టైనింగ్‌కు తీసుకువచ్చి.. బిడ్డ నిద్రకు రాగానే చీరతో ఊయల కట్టి హెల్త్ ట్రైనింగ్ సెషన్‌కు వెళ్లింది. ఈ దృశ్యం చూసిన వారంతా ఇది కదా తల్లి ప్రేమ అంటే.. అని అంటున్నారు.
Fake seeds | అధిక దిగుబడుల పేరుతో నకిలీ విత్తనాలు సప్లై.. కంపెనీ సిబ్బందిని నిలదీసిన రైతులు
Mancherial | కోనూర్‌లో విషాదం.. పంట చేను కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వైరుకు రైతు బలి
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు