పాల్వంచ, ఏప్రిల్ 16 : తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలకు పోషకాలు అందుతాయని సీడీపీఓ లక్ష్మిప్రసన్న అన్నారు. పోషణ పక్వాడలో భాగంగా బుధవారం పాల్వంచ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధి షిర్డి సాయినగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వెయ్యి రోజుల ప్రాముఖ్యత, చిరుధాన్యాల ప్రయోజనాలు, గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం గురించి వివరించారు. అనంతరం పలువురు గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి, ఐసిపిస్ కళ్యాణి, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల హెచ్ఎం, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Palvancha : తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డకు తగినంత పోషకాలు : సీడీపీఓ లక్ష్మిప్రసన్న