ఇల్లెందు ,ఏప్రిల్ 23 : ఇల్లెందు పట్టణంలో 600 మి.మి వ్యాసం కలిగిన పిసిసిపి పైప్ లైన్ లీకేజీ కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేసినట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన పైప్ లైన్లో లీకేజీ కారణంగా ఇల్లందు(69), గార్ల(78), బయ్యారం(89) మండలాల్లోని మొత్తం 236 హ్యాబిటేషన్ లలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు ఆయన వెల్లడించారు.
మిషన్ భగీరథ సిబ్బంది మొత్తం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలిపారు. ప్రజలందరికీ గ్రామ పంచాయతీల ద్వారా తాత్కాలికంగా బోర్వెల్, ఓపెన్ వెల్, ఇతర మార్గాల ద్వారా త్రాగునీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. త్వరితగతిన పైప్ లైన్ పనులను పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్దరించాలని మిషన్ భగీరథ ఈఈ తిరుమలేశ్ను కలెక్టర్ ఆదేశించారు.