KCR Birthday Celebrations | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అండాలస్ గార్డెన్లో నిర్వహించిన వేడుకల్లో ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న 62 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేసీఆర్ తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారని గుర్తుచేశారు. నా రాష్ట్రం నాకు ముఖ్యం, నా ప్రాణం తెలంగాణ, తెలంగాణకు నీళ్లు రావాలి.. నా ప్రజలు బాగుండాలి.. అది చూసి సంతోషపడాలన్నదే నా లక్ష్యం అని తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా, తెలంగాణను అభివృద్ధిలో, మౌలిక సదుపాయాల కల్పనలో ముందంజలో ఉంచారని పేర్కొన్నారు.

Kcr Birthday Bahrain1
పదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని.. ఆ నిజాన్ని అబద్ధాలతో కప్పివేయాలని చూడటం తగదని అన్నారు. కేసీఆర్ పాలనపై దుష్ప్రచారం చేసే రాజకీయ నేతలు ఇప్పటికైనా మారాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. భగవంతుడి ఆశీర్వాదంతో కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంట ఎలా ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి వెంటనే అలాగే ఉంటామని స్పష్టం చేశారు.
ఈకార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీశ్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి అన్నారం సుమన్ , కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, ఉత్కం కిరణ్ గౌడ్, మల్లెల ప్రమోద్, పుప్పలవాయి వంశీ బీఆర్ఎస్ నాయుకులు పాల్గొన్నారు.