న్యూఢిల్లీ: మీరట్ మెట్రో(Meerut Metro)ను త్వరలో ప్రారంభించనున్నారు. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే మెట్రో మార్గంగా దీన్ని రూపొందించారు. ఇక మీరట్ నుంచి ఢిల్లీకి కేవలం 55 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు. ఫాస్టెస్ట్ మెట్రో సర్వీస్‌గా రూపుదిద్దుకుంటున్నట్లు మీరట్ మెట్రో కారిడార్‌లో రైలు గంటకు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లనున్నది. 21 కిలోమీటర్ల ఆ కారిడార్‌ను ఫిబ్రవరి 22వ తేదీన ప్రధాని మోదీ ఓపెన్ చేయనున్నారు. మీరట్ సౌత్ నుంచి మోదీపురం వరకు ఆ రైలు వెళ్తుంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఉన్నాయి. కేవలం 30 నిమిషాల్లోనే ఈ దూరాన్ని కవర్ చేయనున్నారు.
సెమీ హై స్పీడ్ నమో భారత్ రైళ్లకు ఏర్పాటు చేసే ట్రాక్స్‌ను మీరట్ మెట్రోకు ఏర్పాటు చేశారు. ఆధునిక స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందించిన ట్రెయిన్ సెట్స్ ఆ మెట్రోలో ఉండనున్నాయి. లైట్‌వెయిట్ డిజైన్‌తో కోచ్‌లను తయారు చేశారు. ఫ్లోరోసెంట్ గ్రీన్, బ్లూ, ఆరెంజ్ కలర్స్‌లో బోగీలు ఉండనున్నాయి. ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ టెక్నాలజీ .. కొత్త మెట్రో రైళ్లను తయారు చేశారు.
మీరట్ మెట్రో మార్గంలో ప్రతి రైలులో ఏసీ ఉంటుంది. సుమారు 700 మంది ప్రయాణికులు వెళ్లే రీతిలో డిజైన్ చేశారు. 173 మంది వరకు కూర్చోవచ్చు. లగేజీ ర్యాక్‌లు, యూఎస్బీ చార్జింగ్ పోర్టులు ఉన్నాయి. మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా కూడా ఉంది. ప్రధాని మోదీ మీరట్ మెట్రో మార్గాన్ని ఓపెన్ చేయనున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రైస్ లైన్లో మెట్రో వేగం గంటకు 110 కిలోమీటర్లుగా ఉన్నది.