Telangana Student: కురుక్షేత్ర నిట్ హాస్టల్లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
Telangana Student: 19 ఏళ్ల తెలంగాణ విద్యార్థి(Telangana Student) ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ హాస్టల్లో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కురుక్షేత్ర: హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యను అభ్యసిస్తున్న 19 ఏళ్ల తెలంగాణ విద్యార్థి(Telangana Student) ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ రూమ్‌లో అతను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ స్టూడెంట్ను అంగోద్ శివగా గుర్తించారు. అతని స్వస్థలం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామం. సీఎస్ఈ సబ్జెక్టులో అతను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. క్యాంపస్‌లో ఉన్న హాస్టల్ రూమ్‌లోనే అతను స్టే చేస్తున్నాడు. స్పాట్లో సూసైడ్ నోట్ ఏమీలేదని పోలీసులు వెల్లడించారు.
ఘటన సమయంలో శివ రూమ్‌లోనే ఒంటరిగా ఉన్నాడు. హర్యానాకు చెందిన ఇద్దరు రూమ్మేట్స్ మాత్రం ఆ టైంలో మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్లారు. సోమవారం 10 గంటలకు శివ క్లాసులకు హాజరైనట్లు తెలిసింది. క్లాసులు ముగిసిన తర్వాత శివ రూమ్‌కు వెళ్లగా, అతని క్లాస్మేట్స్ మెస్‌కు వెళ్లారు. చాలా టైం వరకు కూడా మెస్‌కు రాకపోవడంతో అతని రూమ్మేట్స్ శివకు ఫోన్ చేశారు. కానీ ఎటువంటి స్పందన రాలేదు. దీంతో రూమ్ వద్దకు వెళ్లడంతో దాన్ని లోపలి నుంచి లాక్ చేసినట్లు గుర్తించారు.
బిల్డింగ్ మరో వైపు నుంచి వెళ్లి చూసిన రూమ్‌మేట్స్‌కు శివ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడడాన్ని చూశారు. నిట్ యాజమాన్యానికి ఈ విషయాన్ని చేరవేశారు. తానేసర్ పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు చెప్పారు. లోక్ నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని ఉంచారు. శివ కుటుంబసభ్యులకు విషయాన్ని తెలియజేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా స్టేట్మెంట్ తీసుకోనున్నారు.
శివ తరుచూ ఫోన్లో మాట్లాడేవాడని, ఎక్కువగా తన మాతృభాషలో అతను మాట్లాడేవాడని రూమ్మేట్స్ చెబుతున్నారు. అతని మాతృభాష తమకు అర్థం కాకపోయేదని, కానీ తమతో హిందీలో మాట్లాడేవాడని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

