భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సతీమణి వసంతలక్ష్మితో కలిసి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మరింత శక్తినివ్వాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.