ఇల్లెందు, జనవరి 01 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మేత కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్లే మేకల ట్రాలీ పల్టీ కొట్టిన ఘటనలో 15 మేకలు మృతి చెందాయి. ఈ దుర్ఘటన ఇల్లెందు మండలం పోచారం తండా సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గుండాల మండలం శెట్టిపల్లి నుండి పోచారం తండా మీదుగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సంచార మేకల ట్రాలీ పోచారం గుట్ట సమీపాన అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ట్రాలీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మినీ ట్రాలీలో ఉన్న 15 మేకలు మృతి చెందాయి.