దమ్మపేట, జూలై 17 : దమ్మపేట మండలంలోని నాయుడుపేట పాఠశాలలో తొలగించిన మధ్యాహ్నం భోజన కార్మికురాలిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్న ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయుడుపేట పాఠశాలలో కె.నాగమణి గత 12 సంవత్సరాలుగా వంట చేస్తుందని తెలిపారు. కాగా కొంతమంది గ్రామస్తులు ఆమెను అడ్డుకుని బలవంతంగా విధుల నుండి తొలగించటం దుర్మార్గమన్నారు. ఈ విషయమై ఎంఈఓ జగపతికి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాగమణిని పంట కార్మికురాలుగా విధుల్లోకి తీసుకోవాలని అలాగే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, రామకృష్ణ, సత్యవతి, ఈశ్వరమ్మ, పార్వతి, వెంకటలక్ష్మి, భూదెమ్మ, జయలక్ష్మి పాల్గొన్నారు.