చండ్రుగొండ, ఫిబ్రవరి 16 : కులగణన సర్వేలో(Caste census survey) కాపుల అన్యాయం జరిగింది. సర్వేలో మున్నూరు కాపుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయవద్దని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం చండ్రుగొండ మండలం పోకల గూడెం గ్రామంలో ఆదివారం మున్నూరు కాపు మండల కమిటీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. సంఘం మండల అధ్యక్షుడు రామిశెట్టి సైదయ్య అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మున్నూరు కార్పొరేషన్‌కు దిశా నిర్దేశం చేసి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరు కాపులకు సముచిక స్థానం కల్పించాలన్నారు. రాజకీయ పార్టీలు సైతం మున్నూరు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వెలగల మధు, జిల్లా అడహక్ కమిటీ కో కన్వీనర్ లంక నరసింహారావు, మండల సహాయ కార్యదర్శి పూసల లక్ష్మీపతి, మున్నూరు కాపు సంఘం నాయకులు యాసం కాశీ విశ్వనాధ్, భోగి కృష్ణ, పాలెపు వెంకటేశ్వర్లు, చిట్టెశెట్టి శ్రీను, చిట్టంశెట్టి లక్ష్మయ్య, గాజుల ప్రసాద్, ఆది మల్ల సురేష్, పసుపులేటి రాధాకృష్ణ, జ్యోతి దొరకయ్య, అంచ సత్యనారాయణ, అంచ యాకయ్య, సుంకర రామారావు, రామ్ శెట్టి శ్రీనివాసరావు, గాజుల లక్ష్మణరావు, గూండా బ్రహ్మం, రంగిశెట్టి నరేష్, తదితరులు పాల్గొన్నారు.