రామవరం, సెప్టెంబర్ 24 : బాత్రూంకు వెళ్లి కాలు జారి కిందపడి గొంతుకు తీవ్రగాయం కావడంతో రామవరం పంజాబ్ గడ్డకు చెందిన బైరీమల్ల మధుసూదన్ (41) మృతి చెందిన ఘటన బుధవారం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామవరం పంజాబ్ బస్తీకి చెందిన బైరీమల్ల మధుసూదన్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మధుసూదన్ పనికి వెళ్లేందుకు స్నానం చేయడానికి బాత్రూం వెళ్లి జారి కిందపడగా గొంతుకు తీవ్రగాయం అయింది. 108కు ఫోన్ చేసి కొత్తగూడెం జిల్లా అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించాడు. మధుసూదన్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.