దుమ్ముగూడెం, ఆగస్టు 25 : దుమ్ముగూడెం మండల పరిధిలోని సుంకర కాలనీ గ్రామానికి చెందిన కాశిబోయిన యాకయ్య(అఖిల్) (38) ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాకయ్య ఆదివారం ఉదయం చేపలవేటకు వెళ్లాడు. పెద్దనల్లబెల్లి స్మశాన వాటిక సమీపంలోని చిన్న కాల్వలో ఆదివారం చేపలవేటకు వెళ్లి మూర్చ రావడంతో కాల్వలో పడి మృతి చెందాడు. కాగా మంగళవారం అటువైపు వెళ్లిన కొందరు పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య సంఘటన స్థలానికి చేరుకుని అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేయించారు. కేసు నమోదు చేశారు. యాకయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.