బూర్గంపహాడ్, ఏప్రిల్ 11 : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మణుగూరు క్రాస్ రోడ్డు సమీపంలోని సందెళ్ల రామాపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగభిక్షం తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామానికి చెందిన నూనె వినయ్ కుమార్ (25) కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపం చెంది శుక్రవారం రాత్రి మణుగూరు క్రాస్ రోడ్డులోని సందెళ్ల రామాపురం సమీపంలో పురుగుల మందు తాగి మృతి చెందాడు. మృతుడి తల్లి నూనె వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.