కారేపల్లి, మే 12 : సింగరేణి మండల ఎంపీడీఓగా ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి ఎంపీడీఓగా పని చేసిన పి.శ్రీనివాస్ పదోన్నతి పొంది ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం సింగరేణి మండల ఎంపీఓగా సేవలందిస్తున్న మల్లెల రవీంద్ర ప్రసాద్‌కు ఇన్చార్జి ఎంపీడీఓ బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మల్లెల రవీంద్ర ప్రసాద్ కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో సమావేశమై మండల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, తోటి అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.