Ramavaram : దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి : కాపు కృష్ణ
జులై 9న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో ఏర్పాటు చేసిన కార్మిక యూనియన్ల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రామవరం, జూన్ 28 : జులై 9న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో ఏర్పాటు చేసిన కార్మిక యూనియన్ల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సమ్మెతో కనువిప్పు కలగాలన్నారు. 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్ లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
కార్పొరేట్ సంస్థలకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్రను అంతా ఖండించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు సెంట్రల్ కమిటీ మెంబర్ ఈశ్వర్, ఫిట్ సెక్రెటరీ పిచ్చయ్య, జి.ఎస్ శ్రీనివాస్, ఆంజనేయులు, బ్రాంచ్ సెక్రటరీలు, చంద్రశేఖర్, తిరుపతి, అశోక్, పి పి రాజు, సాగర్, ఖాజా భక్ష, పూర్ణ, పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

