రామవరం, ఏప్రిల్ 25 : జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం చాలా బాధాకరమైన విషయమని, ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని రుద్రంపూర్ ముస్లిం పెద్దలు అన్నారు. శుక్రవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలోని మస్జిద్ ఎ ఖుబా ప్రత్యేక ప్రార్థన అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. చేతల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా ఎవరికైనా నష్టం, కష్టం కలిగిస్తే మీరు విశ్వాసులే కారు అని ధర్మం చెప్తుందన్నారు. అమాయకులను చంపమని ఇస్లాం ఏనాడూ ప్రోత్సహించదని తెలిపారు.
అమాయకులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాద కాల్పుల్లో మరణించిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, ఉగ్రవాదులతో పోరాడి మరణించిన కశ్మీర్ యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలను మానవతా వాదులందరు ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మసీదు ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్, ఐ ఎన్ టి సి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్, మొహమ్మద్ రఫీ, మొహమ్మద్ ఉమర్ ఫారూఖ్, షేక్ సోనూభాయ్, మదర్ సాబ్, రహీం, ఖాసీం సాబ్, మునవర్, షాహిద్, అజార్, రహీం, ఆలం, షమీమ్, సలీం, తాజ్, షమీముల్లా పాల్గొన్నారు.